నాని వి సినిమా ఓటీటి లో విడుద‌ల అయివుతుందా?

‘వి’ సినిమా ఓటీటి లో విడుద‌ల అయివుతుందా?

కరోనా వైరస్ ప్రభావం మొదలవడానికి ముందుగా విడుదలకు సిద్ధమైన సినిమాల పరిస్థితి ఇబ్బందిగా మారింది అని చెప్పాలి. అందులోను నాని నటించిన ‘వి’ సినిమా,మెగా ఫ్యామిలీ నుండి వస్తున్నా కొత్త హీరో ‘ఉప్పెన’ సినిమా, ఇస్మార్ట్ శంకర్ హిట్ తో జోరుమీద్దున్న రామ్ ‘రెడ్’ సినిమా లు కరోనా వల్ల రిలీజ్ బ్రేక్ పడింది. వైరస్ ప్రభావం తగ్గగానే సినిమాలు రిలీజ్ చేసేద్దామని నిర్మాతలు చూస్తున్నారు. కానీ ఓటీటీల నుంచి మంచి మంచి ఆఫర్లు వచ్చినా అవి తమకు గిట్టుబాటు కాదని ఆగిపోతున్నారు నిర్మాతలు. ముఖ్యంగా నాని-సుధీర్ బాబుల కాంబినేషన్లో ఇంద్రగంటి రూపొందించిన ‘వి’ ఓటీటీ రిలీజ్ గురించి మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. దిల్ రాజుకు ఈసారి మంచి ఆఫర్ వచ్చిందని  ఓటీటిల్లోకి విడుద‌ల‌ను గురించి పరిశీలిస్తున్నారంట ,వడ్డీల భారం భరించడం కష్టమని భావించిన ఆయన ఈ చిత్రాన్ని ఓటీటీకి ఇచ్చేయడానికి రెడీ అయిపోయారని అంటున్నారు. కానీ దినికి నాని ఓటీటీ విడుద‌ల‌కు ఓకే చెప్ప‌డం లేదు…

https://youtu.be/NBGD9D-Nh0o

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *