బిగ్‌బాస్ సీజన్ 4 హోస్ట్ గా విజయ్ దేవరకొండ

బిగ్‌బాస్ -4 హోస్ట్ గా విజయ్ దేవరకొండ

బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంత పాపులరో తెలిసిందే. ఈ షో ఇప్పటి వరకు తెలుగులో మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది.

బుల్లితెర సెన్సేషనల్ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ గురించి మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక బిగ్ బాస్ 3 సీజన్‌ను నాగార్జున హోస్ట్ గా చేయ్యగా.. రెండవ సీజన్‌ను నాని, మొదటి సీజన్‌ను ఎన్టీఆర్‌ హోస్ట్‌గా అదరగొట్టారు.. తమ యాంకరింగ్‌తో సందడి చేశారు. ఇక నాల్గవ సీజన్ గురించి మాట్లాడితే.. కరోనా లేకపోయింటే ఇప్పుటికే ఈ షో జరుగుతుండేది.

https://youtu.be/DwxOVtgwRno

ఇప్పటిదాకా ‘తెలుగు బిగ్ బాస్ సీజన్ 4’కు తారక్, సమంతా, నాగార్జున హోస్ట్‌గా చేసే అవకాశం ఉందని ఇటీవల వార్తలు రాగా తాజాగా రౌడీ విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. బిగ్ బాస్ నిర్వాహకులు ఈ విషయంలో విజయ్‌ను అడగడం.. ఆయన కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది. ఒక వేళా.. బిగ్‌బాస్ నాల్గవ సీజన్‌కు విజయ్ దేవరకొండ హోస్ట్‌గా వస్తే ఆ రియాలిటీ షోకు మరింత క్రేజ్ ఏర్పడే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని సినీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *