ఏమైనా మద్రాస్ హైకోర్టు జడ్జ్ అనుకుంటున్నావా..
తమిళ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత మూడో పెళ్లి గత కొద్దీ రోజులుగా కోలీవుడ్‌లో వివాదాలకు దారి తీస్తుంది. అయితే వనిత విజయ్ పీటర్ పాల్‌ను పెళ్లి చేసుకున్న సమయం నుండి వనిత విజయ్ పై రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. తాజాగా ఒక లైవ్ చర్చ కార్యక్రమంలో వనిత విజయ్ మరియు లక్ష్మీ రామకృష్ణన్ పాల్గొన్నారు. ఆ చర్చ వేదికలో నువ్వెంత అంటే నువ్వెంత అనేలా వీరి ఇద్దరి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరగగా.. వనిత ఒకనొక సమయంలో బూతుపురాణం మొదలుపెట్టింది. నేను చేసిన పని తప్పు అనడానికి నువ్వు ఏమైనా మద్రాస్ హైకోర్టు జడ్జ్ అనుకుంటున్నావా?… ఒక్క భర్తతో సంసారం చేసినంత మాత్రాన నువ్వు ఏమైనా పతివ్రతవు అనుకుంటున్నావా అని లక్ష్మీ రామకృష్ణన్‌పై నిప్పులు చెరిగారు.
https://youtu.be/R99D87rMiwA





