అక్కినేని అమలా గురించి మీకు తెలుసా ?
అక్కినేని అమలా అనగానే మనకు మొదటగా గుర్తుకువచ్చేది అక్కినేని నాగార్జున భార్య అని. అమలా ఒక సినీ నటి అంతేకాదు జంతు సంక్షేమ కార్యకర్త మరియు బ్లూక్రాస్ హైదరాబాద్ కన్వీనర్. అక్కినేని అమలా సెప్టెంబర్ 24, 1968 లో జన్మిచారు ఆమె తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు, తండ్రి ముఖర్జీ బెంగాళీ . అమలా తండ్రి ఒక నేవీ ఆఫీసర్. అమలా తొలిసారిగా టి. రాజేందర్ దర్శకత్వం వహించిన మిథిలి యెన్నై కదలి చిత్రంతో తమిళ పరిశ్రమకు పరిచయమైనది . ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో ఆమె తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించింది. నాగార్జునతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 1993లో వివాహం చేసుకున్నారు ఆ తరువాత నుండి అమల సినిమాలకు దూరంగావున్నది.ఆ సమయంలోనే ఆమె జంతువుల సంరక్షణ కోసం “బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్” అనే సంస్థ ను ఏర్పాటు చేసింది.





