ఆర్జీవీ పర్యవేక్షణలో ‘ఆర్జీవీ బయోపిక్’…!

ఆర్జీవీ పర్యవేక్షణలో 3 భాగాలుగా ‘ఆర్జీవీ బయోపిక్’…!

ఒకప్పుడు బాలీవుడ్ మరియు టాలీవుడ్ లో గొప్ప డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వార్మ. ఇప్పుడు అందరిపై సెటైరికల్ గా మూవీస్ తీస్తూ టాలీవుడ్ లో ఇటీవల వివాదాస్పద సినిమాల దర్శకుడు గా రామ్ గోపాల్ వర్మ పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ నిజ జీవితం ఆధారంగా ఒక సినిమాని మన ముందుకు తీసుకువస్తున్నారు. అయితే సినిమా మూడు పార్ట్ లుగా రూపొందిస్తున్నారు. ఈ 3 పార్ట్ లు రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో తెరకెక్కుతుండటం ఒక విశేషం. ఈ సినిమాలని బొమ్మాకు మురళి బొమ్మాకు క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ మూడు పార్ట్స్ కి దొరసాయి తేజ దర్శకత్వం వహించబోతున్నారు.

ఆర్జీవీ రియల్ లైఫ్ స్టోరీ ను ఆధారంగా ఈ సినిమాను సెప్టెంబర్ లో చిత్రీకరణ ప్రారంభం కానుందని మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ పార్ట్ కి ”రాము – రామ్ గోపాల్ వర్మ ఆరంభం” అనే టైటిల్ పెట్టారు. దీనిలో ఆర్జీవీ విజయవాడలోని కాలేజ్ డేస్.. తొలి ప్రేమ.. గ్యాంగ్ ఫైట్స్ తో మొదలై నాగార్జునతో ‘శివ’ సినిమా చేయడానికి ఎలాంటి ప్లాన్స్ వేశాడు.. ఎవర్ని ఎలా వాడుకున్నాడన్నది మెయిన్ స్టోరీగా ఉండబోతోంది.
రెండో భాగాన్ని ”రామ్ గోపాల్ వర్మ – అండర్ వరల్డ్ తో ప్రేమాయణం” అనే టైటిల్ తో ఈ సినిమాలో వర్మ ముంబై జీవితంలో అమ్మాయిలు.. గ్యాంగ్ స్టర్స్ మరియు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో అనుబంధాల గురించి చెప్పబోతోంది. ఇక పార్ట్ 3 ”ఆర్.జి.వి – ది ఇంటెలిజెంట్ ఇడియట్” అనే టైటిల్ తో ఆర్జీవీ వివాదాలు.. దేవుళ్ళ పట్ల శృంగారం పట్ల సమాజం పట్ల ఆయనకి ఉన్న విపరీత వైఖరులతో పాటు.. అతని ఫెయిల్యూర్స్.. ఇతరుల మీద ఆర్జీవీ ప్రభావం గురించి సినిమాని తెరకెక్కించనున్నారు. ఆర్జీవీ బయోపిక్ లోని పార్ట్ 1 సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగస్ట్ 26న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *