రజనీకాంత్ కి కార్ల అంటే ఎంతో ఇష్టం
“సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా లాంబోర్గిని కారును తానే డ్రైవ్ చేసుకుంటూ కూతురు ఇంటికి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నది. రజనీకాంత్ కు కార్ల కలెక్షన్ అంటే చాలా ఇష్టం అయితే రజనీకాంత్ దగ్గర ఉన్న కార్లు గురించి వాటి రేట్లు గురించి చర్చ వైరల్ అవుతున్నది. రజనీకాంత్ నడిపిన లాంబోర్గిని ఉరుస్ కారు ప్రపంచంలోనే ఎక్కువ మన్నిక గల కారు దీని విలువ 3 కోట్లకుపైనే . ఇది సూపర్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్ యూవీ) కారుగా పేరును సంపాదించింది. ఈ కారు యెక్క డిజైన్, గాని లుక్ చాలా అద్భుతగా ఉంటుంది. ఈ కారు యెక్క ఇంటీరియర్ డిజైన్ ను ఇటాలియన్ నిపుణులతో చేసారు. మొదటిసారి గా ప్రీమియర్ పద్మినీ కారును 1980లో కొనుగోలు చేశారు రజనీ. రజనీకాంత్ వద్ద ఉన్న కార్లలో అంబాసిడర్ ఆయనకు చాల ఇష్టం. జపాన్ ,యూకే కార్లను చాలా ఇష్టంగా కొంటారు. తన కలెక్షన్ లో ఆక్స్ ఫర్డ్ సిరీస్ 111 మోడల్ కారు,హోండా సివిక్ కారు,టయోటా ఇన్నోవా,బీఎండబ్ల్యూ ఎక్స్5,మర్సెడెజ్ బెంజ్ జీ క్లాస్,రోల్స్ రాయస్ గోస్ట్, రోల్స్ రాయస్ ఫాంథామ్ మరియు లిమౌసిన్. రజనీ వద్ద ప్రత్యేకంగా లిమౌసిన్ కారు ఉంది. దీని విలువ రూ.22 కోట్లు కు పై మాట. రజనీ కార్లను కొనడమే కాదు వాటిని ఎంతో ఇష్టంగా మరియు భద్రంగా చూసుకొంటారని రజనీకాంత్ స్నేహితులు అంటున్నారు.
https://youtu.be/fPhKT6rFoVI





