రాధే శ్యామ్ మూవీతో నిర్మాతగా ప్రభాస్ సిస్టర్
రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ్ముడు ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు ఇండస్ట్రీకి వచ్చారు. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లో కృష్ణంరాజు నటించే సినిమాలకు నిర్మాతగా వ్యహరిస్తూ ఉండేవారు. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుండి ఓ నిర్మాత రాబోతున్నారు. అది ఎవరో కాదు కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రశీద. ప్రభాస్ తాజా చిత్రం అయిన ‘రాధేశ్యామ్’ తెలుగు లో నిర్మాణ బాధ్యతలను తీసుకున్నది. ఈ చిత్ర నిర్మాతల్లో వంశీ మరియు ప్రమోద్‌తోపాటు ప్రశీద కూడా నిర్మాణ బాధ్యతలను నిర్వర్తిస్తూ మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి ప్రవేశించే ఆలోచన కూడా చేస్తుంది అంట. ప్రశీద తన యెక్క కెరియర్ కోసం వేగంగా అడుగులు వేస్తుంది అని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలు ఆడుతున్నారు.
https://youtu.be/7CcCIBViR_Y





