మెగాస్టార్ బర్త్ డే కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మోహన్ బాబు

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కి మోహన్ బాబు అదిరిపోయే గిఫ్ట్

టాలీవుడ్ లో సీనియర్ హీరోల్లో చిరంజీవి – మోహన్ బాబు లకు ఒక ప్రత్యేకమైన బంధం. ఆన్ స్క్రీన్ లో ఎన్నో సినిమాల్లో ఇద్దరూ మిత్రులుగా మరియు శత్రువులుగా నటించినా వారి ఇద్దరి మధ్య చాలా ఏళ్లుగా అనుబంధమే కొనసాగుతోంది. ఆఫ్ స్క్రీన్ లో ఇద్దరూ పబ్లిక్ లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు .. మళ్ళీ అంతలోనే ఇద్దరూ ఒకటే అనేలా కౌగిలించుకుంటారు. ఈ మధ్య కాలంలో మోహన్ బాబు – చిరంజీవి తమ మధ్య ఉన్నచిన్న చిన్న గొడవలకు స్వస్థి చెప్పి బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. ఏ చిన్న సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాన్ని చూపిచుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా సినీ మరియు రాజకీయ ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ నేపథ్యంలో మరోసారి వీరి అనుబంధం బయటపడింది. మోహన్ బాబు తన ట్విట్టర్ ద్వారా చిరంజీవికి విషెస్ చెప్పారు.చిరంజీవి నాకు చిరకాల మిత్రుడు. మోహన్ బాబు చిరంజీవి పుట్టినరోజు కానుకగా కొయ్యతో చేసిన బుల్లెట్ ను పంపించారు. అది చూసిన చిరంజీవి “నా మిత్రుడు నా పుట్టిన రోజునాడు ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి… థాంక్యూ మోహన్ బాబు” అని మోహన్ బాబు పంపిన గిఫ్ట్ తో దిగిన ఫొటోను కూడా షేర్ చేశారు

 

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *