మకర రాశి September నెల ఫలితాలు
మకర రాశి వారు ఈ నెలలో తమ పాత అలవాట్లు మార్చుకోవాలి, మొండి తనము చాదస్తపు అలవాట్లు మార్చుకోక పోతే ఫలితాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇతరుల తో వ్యాపార విషయాలు ఆర్థిక రాబడి ఇంకా ఇంట్లో మీ ప్రవర్తన వ్యవహారాల్లో జాగ్రత్త పడకుంటే సమస్యలుంటాయి, Business Patnership matters ఇంకా ముఖ్యమైన విషయాలు వాయిదా వేయాలి, సొంత మరియు ఇంట్లో వారి ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం చేయకూడదు, మాట్లాడే మాటలు మీ సమాధానము పద్ధతి మారితే పరిస్థితులు వ్యతిరేకిస్తాయి. ప్రయాణ విషయాలు ఫలితాలు ఉండవు, ఇతరుల విషయాల్లో విపరీతాలుంటాయి, జాగ్రత్త పడక పోతే పరిస్థితులు చేయి దాటిపోతాయి, మారిన పరిస్థితులని ఓపికగా అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది, ఎట్టి పరిస్థితుల్లో అతి తెలివి తేటలు Play చేస్తే స్థితిగతులు వ్యతిరేఖంగా మారుతాయి, ఇతరుల పై ఆధార పడకుండా సొంతంగా మీ పని మీరే నిర్వహించుకోవాలి over-all గా పరిస్థితి బావుంటుంది, నెల మూడవ వారం తరువాత మంచి మార్పులు కలిసివస్తాయి, ఇతర దేశాలు విదేశీ వ్యక్తులు వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల్లో తొందర పడకూడదు, సోదరి సోదరుల తో వ్యవహారాలు బావుంటాయి, దుర్గా దేవి పూజ ని శ్రద్ధ తో నిర్వహించాలి, ప్రతి నిత్యమూ ఆమె భక్తి గీతాలు ఎంతో మేలు చేస్తాయి, పెద్ద ఖర్చు ని వాయిదా వేయాలి.
పూజించాల్సింది : దుర్గా దేవిని, Lucky Numbers: 8, Favour Colours: green.





