వంశీ పైడిపల్లి డైరక్షన్ లో రామ్ చరణ్ మహేష్ బాబు
టాలీవుడ్ లో ఒక హీరో సినిమాలో ఇంకొక హీరో నటించి తమకు ఎటువంటి బేదాభిప్రాయాలు లేవు అంట అలా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరో ల అభిమానులు కూడా ఇలాంటి సినిమాలను బాగా ఆధరిస్తున్నారు. అదేవిదంగా రామ్ చరణ్ కెరియర్ కోసం ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఓ వైపు నటుడిగా అభిమానులను పెంచుకుంటూ మరోవైపు నిర్మాతగా రాణిస్తున్నాడు. రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో RRR మూవీ చేస్తున్నాడు. తన తదుపరి ప్రాజెక్ట్ లో మహేశ్ బాబు, రామ్ చరణ్ కలిసి ఓ కొత్త సినిమా చేస్తున్నారు అని టాలీవుడ్ లో వార్త బయటకు వచ్చింది.
https://youtu.be/VYRofD3-eM4
స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి రామ్ చరణ్ కు ఓ స్టోరీలైన్ వినిపించారట. ఆ స్టోరీ నచ్చి చరణ్ దాని స్క్రిప్ట్ ను పూర్తిగా డెవలప్ చేయమని వంశీకి చెప్పాడట. వంశీ పైడిపల్లి మహర్షి మూవీ హిట్ అవ్వడంతో మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ అయినా GMB ఎంటర్టైన్మెంట్’ బ్యానర్‌పై ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారని తెలియడంతో అందరికి మరింత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.





