ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలో విలన్ గా మనోజ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. వరుసగా క్రేజీ కాంబినేషన్స్ మూవీస్ చేస్తూ ముందుకు వెళుతున్నారు.అయితే కేవలం సౌత్ లోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా మార్కెట్ విస్తరించుకోవాలని చూస్తున్నాడు.రాజమౌళి తో ఆర్ ఆర్ ఆర్ అనే భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా సెప్టెంబర్ కు పోస్ట్ ఫోన్ అయ్యింది. తన తదుపరి చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో చేస్తున్నారు. ఈ సినిమా ఓ భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించనున్నారట. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుందట. అయితే ఈ సినిమాలో విలన్ గా వెతుకుతుండగా వైవిధ్యమైన చిత్రాల మంచు మనోజ్ పేరు పరిశీలిస్తున్నారట. ఎన్టీఆర్ మరియు మనోజ్ లను త్రివిక్రమ్ ఎలా చూపిస్తాడో మరి.
https://youtu.be/-ukMM_ZDY5g





