నాకు బిగ్ బాస్‌కి వెళ్లే ఉద్దేశం లేదు…తరుణ్ క్లారిటీ

బిగ్ బాస్ 4లో తరుణ్ ఎంట్రీపై క్లారిటీ …

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు హీరో తరుణ్. తరుణ్ తన కెరియర్ లో నువ్వే కావాలి, నువ్వులేక నేనులేను, ప్రియమైన నీకు వంటి సినిమాలు చేసి తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్‌ 4 లో తరుణ్ ఎంట్రీ పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తనకు అటువంటి ఆలోచన కూడా లేదని.ఇదంతా ఫేక్‌ న్యూస్‌ అని దీనిని ఎవరు కూడా నమ్మవద్దని.. నిజాలు తెలుసుకోకుండా మీడియాలో ఇలాంటి వార్తలు రాయడం తప్పని నా పై వస్తున్నా వార్తలు అన్ని వ‌దంతులు మాత్ర‌మే అని ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేసాడు. ప్లీజ్ టేక్ కేర్.. కరోనా వేళ అందరూ ఇళ్లలోనే ఉండండి.. స్టే హోం స్టే సేఫ్.. మీ అందరి అభిమానమునకు ధన్యవాదాలు’ అలాగే ఫేక్‌ న్యూస్‌లను ప్రచారం కూడా చేయవద్దని కోరారు.

https://youtu.be/0CoX9id5iPE

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *