వినాయకచవితి పూజా రహస్యము తెలియనిదే ఫలితము ఉండదు
సర్వ విఘ్న హారం దేవం
సర్వ విఘ్న వివర్జి తం
సర్వ సిద్ధ ప్రధాతారం వందేహం గణ నాయకం
మనము ఏ పూజ చేయాలన్నా ముందు గా గణపతి ని ప్రార్థిస్తూ పని మొదలు పెడతాము, గణపతికి ఎంతో ఇష్ట మైన మాసం ఈ (భాద్రపద మాసము) (గణేశుడిని) అర్థం చేసుకోకుండా ఆ మహాదేవుడిని ఎన్ని సార్లు
పూజంచినా ఫలితము ఉండదు ) మానవులు ,దానవులు , దేవతలందరికి జ్ఞానశక్తి సర్వ సిద్ధులకి కారకుడు ఆధిపతి విగ్నేశ్వరుడు, ప్రతి ఒక్కరిలో ఉండే మహా కండలీని శక్తి లో ముఖ్య మై న ( మూలాధార శక్తి కి ) విగ్నేశ్వరుడే అధిపతి , సర్వ విజ్ఞాన మర్మశాస్త్రాలకి మహా మంత్ర శాస్త్రములకి , గురువుల ద్వారా మంత్రో పాసన విద్యకి గణపతే అధిపతి , భాద్రపద శుద్ధ చవితి రోజు సూర్యుడు సింహ రాశిలో ఉండగా ( వినాయక చవితి ) పండగా జరుపుకుంటారు , గణపతిని ఎన్ని రూపాల్లో పూజిస్తారంటే ,
ఈ ( 6 ) రూపాల్లో గణపతిని ప్రధానంగా పూజిస్తే,
( సకల సిద్ధులని ప్రసాదించే విజ్ఞ నాయకుడిని ఇలా పూజిస్తే ఫలితం మహా అద్భుతంగా ఉంటుంధి )
1. మహా -గణపతి
2. హరిద్రా – గణపతి
3. స్వర్ణ -గణపతి
4. ఉచ్చిష్ట- గణపతి
5. సంతాన- గణపతి
6. నవనీత- గణపతి
వినాయకుడి పూజకు కావాల్సిన సామాగ్రి
పసుపు – కుంకుమ – గంధం – అగరవత్తులు – కర్పూరం – తమలపాకులు – వక్కలు – పూలు పూలదండలు -అరటి పండ్లు – కొబ్బరికాయలు – బెల్లం – పంచదార – తోరము – దీపారాధన కుందులు – నెయ్యి – నూనె – దీపారాధన వత్తులు – వినాయకుడి ప్రతిమ – 21 రకాల ఆకులు – ఇంకా ఉండ్రాళ్ళు – పాయసం.
వరాహ పురాణం లోను విగ్నేస్వర జన్మ వృతాంతం ఉంది. అయన పొట్ట చుట్టూ ఉండే పాము శక్తి కి సంకేతము, జగత్తునంతా ఆవరించి ఉన్న మయా శక్తే ఈ పాము. గణపతి ని శ్రద్ధ గా సంపూర్నంగా పూజించడం అంటే అయన తల్లి గౌరీదేవి సహితంగా పూజిస్తే నే ఫలితం ఉంటుంది. ఊహాశక్తి మనో శక్తి యొక్క మహాశక్తి తత్వాన్ని అర్థం చేసుకోవడము గ్రహించే జ్ఞానతత్వాలు వినాయకుడీ అనుగ్రహం తో నే సాధ్యము, అజ్ఞాన అహంకారాలు మహాదోష గుణాలు వీటికి విరుగుడు తత్వ మార్గమే వినాయకుడి ప్రార్థన మరియు ఆరాధన, గణపతి దేవుడి తత్వాన్ని అర్థం చేసుకోగలిగితేనే అయన పూజ కి అసలైన ఫలితం వస్తుంది, గణపతి (చతుర్ముఖముతో ) విశ్వ మంతా వ్యాపించి ఉంటాడు, గణపతి తొండము ఆరాధన భక్తి వర్ణన తో ఎన్నెనో సమస్యల పరిశోధన మార్గములని తెలుపుతుంది.
( గ ) అంటే (విజ్ఞానము) మానవులని తమ పాపాల నుంచి కాపాడే శక్తిని ఇస్తుంది.
( ణ ) అంటే మోక్షమని సర్వ సమస్యల నుంచి విముక్తిని ప్రసాదీస్తుందని.
వినాయకుడి ని పూజించేప్పుడు ఈ ముఖ్య మై న విషయాలని మధిలో స్మరిస్తూ పూజించాలి. వినాయక చవితి మాసము మొత్తము ప్రతి ఒక్కరు వారి తల్లి తండ్రుల కోరికలు తీర్చి వారి దీవెనలు పొందాలి . అందరికి ఈ భక్తి మార్గము ఎంతో మేలు చేస్తుంది , ఈ స్మరణ భక్తి మార్గం అర్థం కానప్పుడు ఆచరించక పోతే ,ఎన్నీ పూజలు వ్రతాలు అభిషేకాలు చేసినా ఫలితం సూన్యము ,
జీవితంలో వ్యతిరేక మైన పరిస్థితులు ఆలస్యము అసంతృప్తి Confusion లాంటి మాయ శక్తులు వేధిస్తుంటాయి. ఇంకా గణపథి ముఖ్యమైన భక్తి ఆరాధన కై ప్రతి ఒక్కరు (ఈ శ్లోకములు శ్రద్ధగా వినాలి బాగా అర్థమయ్యేలా వింటే మహా భక్తి యోగము మరియు జీవితం లో ఎన్నోసమస్యలకు అనుకూల మార్గం దొరుకును)
1) గణేశ పంచ రత్న మాల,
2) వినాయక అష్టోత్తర శతనామావళి,
3) శ్రీ వినాయకుడి దండకము.
ఇంకా శ్రీ వినాయకుడి జన్మ రహస్యము , ( కథ అర్థ చేచేస్కుంటూ వినాలి ఇంకా చదవాలి ),
వినాయకడి భక్తి మార్గము శ్రద్ధగా ఇష్టంతో అర్థం చేసుకోవాలి, వినాయకడి భక్తి జ్ఞానము అర్థం కానిదే ఫలితం ఉండదు, అర్థం కాక పోతే మల్లి మల్లి చూసి విని అర్థం చేసుకోవాలి ఇదే నిజమైన యోగకరమైన భక్తి అదృష్టము.





