ఆస్తి వివాదాలపై క్లారిటీ ఇచ్చిన దాసరి అరుణ్
దాసరి ప్రభు దాసరి అరుణ్ కి మధ్య ఆస్తి గొడవలకు ఒక క్లారిటీ ఇచ్చిన దాసరి అరుణ్ దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి కుమారులు అరుణ్ కుమార్, ప్రభుల మధ్య ఆస్తి తగాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తనపై అన్న దాసరి ప్రభు చేసిన ఆరోపణలపై శనివారం ఆయన హైదరాబాద్ ఫిల్మ్‌ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ దాసరి అరుణ్ స్పందించారు తమ మధ్య ఆస్తి గొడవలు తప్ప మరేం లేవని స్పష్టం చేశారు. దాసరి ప్రభు తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు.





