ఇన్స్పెక్టర్ విజయ్ గా రికార్డు బద్దలు కొడుతున్నా : సాయి శ్రీనివాస్
బాలీవుడ్లో టాలీవుడ్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక్కడి తెలుగు చిత్రాలను అక్కడ డబ్ చేసి యూట్యూబ్‌లో వదిలితే చాలు మిలియన్లలో వ్యూస్ వచ్చేస్తున్నాయి. టాలీవుడ్లో ఆ చిత్రాలు అంతగా ఆడకపోయినా అవి మాత్రం హిందీ భాషలో అనువాదం చేయడంతో పెద్ద హిట్‌గా నిలుస్తున్నాయి.తెలుగు లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా,కాజల్ అగర్వాల్, మెహరీన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కవచం’ చిత్రం దీనిని హిందీ లోకి అనువాదం చేసి దానికి ‘ఇన్స్పెక్టర్ విజయ్’ టైటిల్‌తో యూట్యూబ్‌లో విడుదలచేశారు. ఈ చిత్రం ఇప్పటి వరకు 200 మిలియన్ ప్లస్ వ్యూస్ రావడం విశేషము.
https://youtu.be/9XrRBTrYyOI





