షూటింగ్‌లకు దూరంగా సుమ,అనసూయ
కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో తెలుగు టీవీ స్టార్ యాంకర్లు అయినా సుమ,అనసూయ ఇద్దరు కొద్దిరోజులు షూటింగ్‌లకు దూరంగా ఉండాలని అనుకుంటునట్లుగా ఇండస్ట్రీ వర్గాలో వార్తలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ సడలింపులో భాగంగా జూన్ రెండో వారం నుంచి సినిమా, టీవీ షూటింగ్‌లకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చితగిన జాగ్రత్తలను పాటిస్తూ షూటింగ్‌లు జరుపుకోవాలని సూచించరు. సినిమా,టీవీ పరిశ్రమలో షూటింగ్‌లు తిరిగి మొదలయ్యాయి. ఆ సమయంలో కొంతమంది నటీనటులు కరోనా పాజిటివ్ రావడంతో భయాందోళన మొదలైంది. ప్రస్తుతం షూటింగ్‌లు జరుగుతున్న వాటిలో సుమ ‘క్యాష్’, అనసూయ ‘జబర్దస్త్’ కూడా ఉన్నాయి.ఈ షూటింగ్‌లకు దూరంగా ఇంట్లోనే ఉండాలని సుమ, అనసూయ నిర్ణయం తీసుకున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి.
https://youtu.be/nxXJgrAJww0





