మోస్ట్ బ్యాచులర్ ఆది పినిశెట్టి నిక్కీ గర్లానీ ప్రేమలో
మోస్ట్ బ్యాచులర్ హీరోల లిస్ట్‌లో ఆది పినిశెట్టి ఒకరు. ఈ హీరో ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే.తెలుగు, తమిళం, మలయాళంలో పలు సినిమాల్లో నటించిన నిక్కీ గర్లానీ, ఆది ప్రేమలో ఉన్నట్లు పలు పుకార్లు వచ్చాయి. వీరిద్దరు మలుపు, మరకతమణి చిత్రాల్లో నటించగా.. అవి రెండు మంచి విజయాన్ని సాధించాయి. ఆ క్రమంలోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డట్లు టాక్ నడిచింది.ఆది పినిశెట్టి తండ్రి, ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు వేడుక ఇటీవల చెన్నైలో జరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో ఈ వేడుకకు వారి దగ్గర బంధువులనే పిలవగా… ఈ కార్యక్రమంలో నిక్కీ గర్లానీ భాగమైంది.
https://youtu.be/fVTwVNv2kj8





