రాంగోపాల్ వర్మ పై ఘాటుగా స్పందించిన అమృత
మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య….అమృత ప్రేమ వ్యవహారం, మారుతీరావు ఆత్మహత్యని కథాంశంగా తీసుకోని వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ అనౌన్స్ చేశాడు. ఫాదర్స్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశాడు. “మర్డర్” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టరు చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని అమృత పేర్కొంది… కనీసం ఏడుద్దామన్నా కన్నీరు రావడం లేదని.. తన హృదయం బండబారిపోయిందని… దయచేసి తన జీవితాన్ని బజారులో పెట్టవద్దని అమృత ఆర్జీవికి ఓపెన్ లెటర్ రాసింది. వర్మపై ఎలాంటి కేసు కూడా పెట్టదలచుకోలేదని చెప్తూ రెస్ట్ ఇన్ పీస్ అంటూ అమృత పోస్ట్ చేసింది.
https://youtu.be/gru-MXTMT5k





