రికార్డులను తిరగరాసిన ‘దిల్ బేచారా’ టీజర్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన దిల్ బేచారా చిత్రం టీజర్ ప్రపంచ సినిమా రంగంలోనే వేటికి దక్కని ఒక రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా మే 8 వతేదీన విడుదల కావాల్సి ఉండగా కానీ లాక్ డౌన్ వలన వాయిదా పడింది.దిల్ బేచారా చిత్రం జూలై 24వ తేదీన డిస్నీ+హాట్ స్టార్ అనే ఓటీటీలో విడుదల చేయాలని దర్శకుడు ముఖేష్ చాబ్రా, నిర్మాత ఫాక్స్ స్టార్ అనుకున్నారు ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు టీజర్ విడుదలైన 24 గంటల్లోని 4.8 మిలియన్ల లైక్‌లను సాధించింది. దిల్ బేచారా చిత్రం ఆయన చివరి చిత్రం కావడంతో అభిమానులు, సినీ ప్రేక్షకుల భావోద్వేగంగా స్పందిస్తున్నారు.
https://youtu.be/W-3WRsVw_Hk





