Sajjanar Wife Says Interesting Things About Sajjanar…
దీపావళి రాకముందే దేశంలో దీపావళి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి అని చెప్పవచ్చు.. దిశ కేసు నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతమవడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పలు నగరాల్లో మహిళలు స్వీట్లు పంచుకుంటూ, డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘సాహో సజ్జనార్..’ అంటూ జేజేలు పలుకుతున్నారు. కర్ణాటకలోని హుబ్లీలో సీపీ సజ్జనార్ స్వగ్రామంలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఈ ఘటనపై సజ్జనార్ సతీమణి కూడా స్పందించారు.
సజ్జనార్ గురించి తన భార్య ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది…
హుబ్లీలో నివాసం ఉంటున్న సజ్జనార్ సతీమణి మాట్లాడుతూ.. సజ్జనార్‌కు సంబంధించి ఆసక్తికర వివరాలు తెలిపారు. సజ్జనార్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని, చాలా చాలా క్రమశిక్షణతో ఉంటారని చెప్పారు. ఆయన ఎప్పుడూ బాధితులకు న్యాయం చేయడం కోసం శ్రమిస్తారని తెలిపారు. అయితే.. అందరిలా ఆయన కూడా ఫ్యామిలీ మ్యానే అని అన్నారు
హుబ్లీలో సజ్జనార్‌కు స్నేహితులు ఉన్నారని.. ఫ్రీ టైం దొరికినప్పుడు ఇక్కడికి వచ్చి సరదాగా గడుపుతారని సజ్జనార్ సతీమణి చెప్పారు. హుబ్లీలో టైం స్పెండ్ చేయడం ఆయనకు చాలా ఇష్టమని తెలిపారు. విధుల కాస్త విశ్రాంతి లభిస్తే హుబ్లీ రావడానికే ప్రాధాన్యం ఇస్తారని వెల్లడించారు. సజ్జనార్ మొదటి నుంచే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని.. ఆయనలో నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయని వెల్లడించారు
ఈ ఎన్‌కౌంటర్ మహిళల్లో ఒక భరోసా నింపుతుందని సజ్జనార్ భార్య అభిప్రాయపడ్డారు. మళ్లీ రేప్ ఘటనలు జరిగితే ఫలితం ఎలా ఉంటుందన్నదానికి ఇదో ఉదాహరణ అని చెప్పారు. దిశకు న్యాయం జరిగిందన్నారు. ఆ దుర్మార్గులు ఏదో ఒక రోజు మళ్లీ బయటకు వస్తారని నిన్నటి వరకు అనిపించేదని.. ఈ రోజు వాళ్లకు తగిన శాస్తి జరిగిందని ఆమె అన్నారు
దిశ హత్యాచార నిందితులు ఎన్‌కౌంటర్‌లో హతమవ్వడంతో అటు హుబ్లీలో ప్రజలు సంబురాలు చేసుకున్నారు. పోలీసులకు రాఖీలు కట్టి స్వీట్లు పంచిపెట్టారు. హుబ్లీలోని సైబరాబాద్ సీపీ విశ్వనాథ్ సజ్జనార్ నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది. సజ్జనార్ బంధువులు, స్థానికులు ఆయన నివాసానికి తరలివచ్చి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.
https://youtu.be/ejGmvMR7ia4
1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎన్ అధికారి అయిన విశ్వనాథ్ సజ్జనార్.. కర్ణాటకలోని గదగ్ జిల్లా అసుతి గ్రామంలో జన్మించారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ వార్త తెలియగానే అసుతి గ్రామంలో ప్రజలు మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ సోదరుడు ప్రకాశ్ సజ్జనార్ మాట్లాడుతూ.. తన సోదరుడు ఎప్పుడూ సామాజిక న్యాయం గురించి ఆలోచిస్తారని తెలిపారు.
‘నా సోదరుడు విధుల పట్ల అంకితభావం, నిజాయతీ గల వ్యక్తి. ఆయనకు నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఘటనతో దేశం మొత్తం గర్విస్తోంది. దేశం జరుపుకొనే సంబురాల్లో మేము కూడా భాగస్వాములయ్యాం’ అని సజ్జనార్ సోదరుడు ప్రకాశ్ సజ్జనార్ అన్నారు
Sayyeshaa Celebrated Arya’s Birthday | సెలబ్రేషన్స్ పీక్స్ లో ఉన్నాయి
సరిలేరు నీకెవ్వరు లో విలన్ ఎవరో తెలిసిపోయింది
అసలు ఏవరు ఈ నయనతార ? Full Life Story






One Response
buy cialis online Over 10 years Sir Philip says Arcadia has paid 1