అసలు ఏవరు ఈ నయనతార ? Full Life Story

నయనతార !సినీ రంగుల ప్రపంచంలో ఓ వెలుగు వెలుగుతున్న! తార… సితార !

ఇండస్ట్రీకి తగ్గ బలుపు ..సాటి హీరోయిన్స్ కు లేని గెలుపు ..ఆమెకే సొంతం.
కెరీర్ ఆరంభంలో సోసోగా సాగిన ఆమె ప్రస్థానం !ఒక స్టార్ హీరో తో పెట్టుకున్న ఎఫైర్… ఆ తర్వాత అంతే ఫైర్ తో బ్రేక్ అప్ ,మళ్లీ ఇంకో మల్టీ టాలెంటెడ్ స్టార్ తో ప్రేమాయణం !అది బెడిసికొట్టి ఒకానొక సమయంలో సినిమాలే వద్దు అనుకున్న ఆమె …లేడీ సూపర్ స్టార్ గా ఎలా ఎదిగింది,అసలు ఆమె ప్రస్థానం ఎలా మొదలైంది!ఇప్పుడు ఆమె ఎవరి ప్రేమలో విహరిస్తుంది అనేది చూద్దాం.

నయనతారను ఫ్యాన్స్ ,స్టార్స్ అందరూ ముద్దుగా నయన్ అని పిలుచుకుంటారు.ఈ బ్యూటీకి రెండుమూడు నాటి పేర్లు ఉన్న !అసలు పేరు డయానా మారియము కురియన్.
నవంబర్ 18 1984 బెంగళూరులో కురియన్ కొడియటు,ఉమానా కురియన్ దంపతులకు జన్మించింది..ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు.
నయనతార 2003 మలయాళ ఫిలిం మనసినకారే చిత్రంతో ఇంట్రడ్యూస్ అయింది.అలాగే 2005 అయ్యా చిత్రం ద్వారా తమిళ్ ఇండస్ట్రీకి, లక్ష్మీ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తెలుగు తమిళంలో ఒకేసారి హిట్స్ దొరికేవరకు నయనకు క్రేజ్ సారిగా పెరిగిపోయింది.

ఆ ప్రేమ కాస్త బోలెడన్ని డ్రామాలు గా కొనసాగింది. పెళ్లయి ఇద్దరు పిల్లలున్న ప్రభుదేవా పెళ్ళానికి డివోర్స్ ఇవ్వకుండా నయనతారను పెళ్లి చేసుకుంటున్నాడు అనే పుకార్లు షికార్లు చేశాయి ..ప్రభుదేవా భార్య రమ కోర్టులో కేసు వేయడం, మహిళా సంఘాలు ఆమెకు మద్దతు పలకడం.. అదే టైంలో ప్రభుదేవాకు, నయనతారకు బేధాభిప్రాయాలు రావడంతో ఇద్దరూ విడిపోవడం జరిగింది.
ఆ తర్వాత నయనతార మళ్ళీ కం బ్యాక్ ఇచ్చి పూర్తిగా సినిమాలపై కాన్సెంట్రేషన్ చేసింది,ఆ ఫలితంగా సౌత్ లేడీ సూపర్ స్టార్ ..స్టార్ డమ్ ను సొంతం చేసుకుంది.తెలుగు ,తమిళ్ మలయాళం ఇలా భాషలతో సంబంధం లేకుండా బిజీబిజీగా గడిపింది.

ఇలా వరుసగా చంద్రముఖి ,దుబాయ్ శీను, తులసి ,గజిని వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లే సరికి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా పోయింది.
వల్లభా సినిమా చేస్తున్న టైంలో తమిళ స్టార్ హీరో శింబు ప్రేమలో మునిగితేలిన నయన్..ఇద్దరూ క్లబ్బులు పబ్బులు మబ్బులు అని తేడా లేకుండా ఆ టైమ్లో ఇద్దరు చేసిన రచ్చ మామూలుగా లేదు… వీళ్ళిద్దరూ పక్కగా పెళ్లి పీటలు ఎక్కుతారు అనుకునే సమయంలోనే ఇద్దరి రిలేషన్షిప్ కి బ్రేక్ పడింది..ఆ సమయంలోనే నయనతారకు సినిమాల్లో కూడా కొన్ని ఫ్లాప్స్ రావడం…అమ్మడి కెరీర్ కు ,పర్సనల్ లైఫ్ కు సరైన గైడెన్స్ లేక సతమతం అయింది.
అప్పుడే నయనతారకు ఓదార్పుగా తనలో మార్పు తీసుకు వచ్చిన ప్రభుదేవాకు దగ్గరయింది ,ఇద్దరూ పచ్చబొట్టు పొడిపించుకుని ఎంత గాఢంగా ప్రేమించుకున్నారు…ప్రభుదేవా కు ఉన్న క్రేజ్ కు … వాళ్ల రిలేషన్ గురించి ఇండియాన్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

ఈ బ్యూటీ ఎంత పెద్ద హీరో సినిమాల్లో అయినా యాక్ట్ చేసిన మూవీ ప్రామిస్ ప్రమోషన్లో పాలుపంచుకోక పోవడం ఆమె స్పెషాలిటీ.ఆఖరికి మన సైరా కి కూడా ప్రమోషన్ లో పాల్గొనలేదు.
2015 లో నానూన్ రౌడీ దాన్ సినిమా తో ఒక డిఫరెంట్ క్యారెక్టర్క్యారెక్టర్ తో మనల్ని అలరించిన నయన్ ఆ చిత్ర దర్శకుడు విగ్నేష్ ప్రభు..నయన్ తో పోల్చుకుంటే చిన్నవాడైన అతనితో ప్రేమలో పడడం కొసమెరుపు. నాలుగేళ్లుగా ఇద్దరూ ఏదో ఒక సందర్భంలో మీడియా కంట పడం ,ఈమధ్య వాళ్ళిద్దరి రిలేషన్ ని ఓపెన్ అవ్వడం కూడా జరిగింది.పెళ్లి చేసుకోవడం ఖాయం అంటున్నారు ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడ్డ నయన్ మూడు ముళ్ళు వేయించుకుంటుందో లేదో వేచి చూద్దాం…

 

                                      

Share this article

4 Responses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *