సుశాంత్ హౌస్ కీపర్ నీరజ్ సింగ్ వాంగ్మూలం
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు కొంత మంది దగ్గర వాంగ్మూలాన్ని సేకరించారు. ఆ తరువాత సీబీఐ ఆరు బృందాలుగా విడిపోయి పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు .ఈ విచారణలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. సీబీఐ అధికారులు విచారణలో సుశాంత్ చనిపోయిన జూన్ 14న ఏం జరిగిందనే దానిపై సుశాంత్ హౌస్ కీపర్ నీరజ్ సింగ్ వాంగ్మూలంను సేకరించారు. సుశాంత్ ఉదయం 8 గంటలకు గది నుండి బయటకు వచ్చి నీరు అడిగగా తాను తీసుకెళ్లి ఇచ్చానని.. ఆ తర్వాత చిరునవ్వుతూ గదిలోకి వెళ్లారని’ నీరజ్ సింగ్ తెలిపారు. ఆ తరువాత ఉదయం 9.30 గంటలకు అరటిపండ్లు కొబ్బరి నీళ్లు జ్యూస్ తీసుకొని రమ్మని అన్నారు అవి తీసుకోని వెళ్లగా కేవలం కొబ్బరినీళ్లు మాత్రమే తాగాడని నీరజ్ సింగ్ వాంగ్మూలంలో తెలిపాడు.
ఆ తర్వాత ఉదయం 10.30 గంటలకు తన గదిలోకి వెళ్లి లాక్ వేసుకున్నాడని.. కొద్దిసేపు తర్వాత తన గది వెళ్లి పిలిచినా స్పందన లేదని వివరించాడు. ఈ విషయాన్ని కిందనే ఉన్న దీపేష్ సిద్ధార్త్ లకు చెప్పగా. తను వచ్చి డోర్ కొట్టినా ఎటువంటి స్పందన రాలేదు. సుశాంత్ ఫోన్ కు కాల్ చేసినా స్పందన రాలేదు. సుశాంత్ సోదరి మీతు దీదికి ఫోన్ చేయగా ఆమె గది తలుపులు తెరవమని మాకు చెప్పారని నీరజ్ వివరించారు. తాళం తీసే వ్యక్తిని తీసుకొచ్చి ప్రయత్నించగా అతను విఫలమయ్యాడని… ఆ తర్వాత తామంతా తలుపులను పగులకొట్టి గదిలోకి వెళ్ళమని .. ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడని కొద్ది సమయంలో అక్కడికి సుశాంత్ సోదరి కూడా వచ్చారని.. నీరజ్ సింగ్ వివరించాడు..





