లెజండరీ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ కన్నుమూత
లెజండరీ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ పలు శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను గత నెల 17న ముంబయిలోని గురునానక్ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం వేకువజామున గుండెపోటుతో కన్నుమూశారు. సరోజ్ ఖాన్ మరణవార్తతో బాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ‘ఆర్‌ఐపీ సరోజ్‌ఖాన్’ అంటూ పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని బాలీవుడ్ నటులు గుర్తు చేసుకున్నారు. అజయ్‌దేవగణ్, అనుష్కశర్మ, వరుణ్‌ధావన్, టైగర్‌ష్రాఫ్ తదితరులు ఆమెకు నివాళులర్పించారు.
https://youtu.be/m9nKRslYk2g





