యశోద హాస్పిటల్ పై ఆగ్రహం వ్యకం చేసిన మహిళ
హైదరాబాద్ లో రోజు రోజుకూ ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా రోగుల పట్ల వారి ప్రవర్తన ఆశ్చర్యమునకు గురిచేస్తున్నాయి. తాజాగా సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది . అంబర్‌పేట్‌కు చెందిన సి. నరసింగరావు అనే వ్యక్తికి కరోనా సోకిందని పది రోజుల క్రితం యశోదాలో చేర్చడం జరిగింది . చికిత్స పేరుతో ఇప్పటిదాకా ఎనిమిదిలక్షలు బాధితులతో కట్టించారు .సి. నరసింగరావు చనిపోవడం జరిగింది అని ఇంకా ఐదు లక్షలు చెల్లించి బాడీని తీసుకవెళ్లాలని ఆసుపత్రి యాజమాన్యం కుటుంబానికి సమాచారం అందించారు. అది తెలిసిన కుటుంబసభ్యులు తీవ్రమైన మనస్తాపమునకు గురైయ్యారు. తరువాత కుటుంబసభ్యులు నరసింగరావు అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. అయితే వారికి ఎందుకో అనుమానం వచ్చి మరోసారి ఎంక్వైరీ చేయడంతో నరసింగరావు బతికే ఉన్నాడని వీడియో కాల్‌లో చూపించారు. ఆయన బతికే ఉన్నాడని తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆసుపత్రి నిర్వాకంపై ఆగ్రహం వ్యకం చేసారు.
https://youtu.be/tCi6k_dNsQU





