పెళ్లి విషయం పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అనగానే ప్రభాస్ పేరు ఠక్కున చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నేళ్లుగా ప్రభాస్ పెళ్లి పై వచ్చిన వార్తలు ఏ హీరో పై రాలేదనే చెప్పాలి. ప్రభాస్ పెళ్లి పై ఎన్నో వివాదాలు.. ఎన్నో పుకార్లు కూడా బాగా వినిపిచాయి. ప్రభాస్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ మీడియా కు కంటపడితే ప్రభాస్ పెళ్లి గురించిన ప్రశ్నలే వినిపిస్తునాయి. అయితే ఇదే ఇలా ఉండగా గతం లో ప్రభాస్ పెళ్లికోసం కృష్ణం రాజు ఓ అమ్మాయిని చూసేశాడని.. మొదట్లో అనుష్కతో పెళ్లి అని ఆ తరువాత తాజాగా నిహారికతో అని ఎవరికి నచ్చిన వార్తలు వారు సోషల్ మీడియా లో స్ప్రెడ్ చేశారు.
తాజాగా ప్రభాస్ తనకు పెళ్లంటే అయిష్టం కాదని.. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు .అయితే ఎప్పుడు జరుగుతుంది అంటే మాత్రం చెప్పలేను అన్నాడు. అసలు నా పెళ్లి విషయం మా ఫ్యామిలీ కంటే మీడియా వారికే ఆత్రం ఎక్కువ ఉందని కౌంటర్ వేశాడు.





