ప్రభాస్ తో కలసి ‘బ్లవర్లీ హిల్స్’లో భోజనం చేయాలి
ప్రభాస్ అభిమానులకు ఆదిపురుష్ సినిమాతో పెద్ద పండగే అంటున్నారు కృష్ణంరాజు. ఆదిపురుష్ సినిమా రూ.1000 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే గొప్ప సినిమా అవుతుంది. కృష్ణంరాజు ప్రభాస్ తో తనకు ఒక కోరిక ఉందనీ.. అది ప్రభాస్ కి చెప్పాననీ అన్నారు. ఇప్పుడు ఆ కోరిక ఆదిపురుష్ సినిమాతో తీర్చేయబోతున్నాడని అని అన్నారు కృష్ణంరాజు. ప్రభాస్ తో కలసి ‘బ్లవర్లీ హిల్స్’లో భోజనం చేయాలనేది కృష్ణంరాజు కి కోరిక అట. కృష్ణంరాజు బ్లవర్లీ హిల్స్ ప్రత్యేకత ఏమిటో చెప్పారు. ”బ్లవర్లీ హిల్స్‌లో ఓన్లీ హాలీవుడ్ స్టార్లకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అందుకే అక్కడ ప్రభాస్‌తో కలిసి భోజనం చేయాలని ఉందనే కోరిక కోరాను. అందులో ప్రభాస్‌కి కూడా ఒక బిల్డింగ్ ఉండాలి.. నేను అక్కడ ప్రభాస్‌తో కలిసి భోజనం చేయాలి. త్వరలోనే ఆ కోరిక తీరబోతోంది. ప్రభాస్‌ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.





