జూనియర్ ఎన్టీఆర్ బావమరిది టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది టాలీవుడ్ ఎంట్రీ

తెలుగు సినీ పరిశ్రమలో వారసులదే హవా. ఎంతో మంది హీరోలు తమ వారసులను హీరోలుగాను విలన్ గాను సినీ పరిశ్రమలో పరిచయం చేసారు. తాజాగా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ బావమరిది నితిన్ ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడా అని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అయితే బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ఇంటి నుంచి మరో నట వారసుడు… ప్రముఖ వ్యాపారవేత్త నార్నే శ్రీనివాస్ కుమార్తె ప్రణతిని జూనియర్ ఎన్టీఆర్ పెళ్లాడిన విషయం తెలిసిందే. నార్నే శ్రీనివాస్ కుమారుడు, నందమూరి లక్ష్మి ప్రణతి తమ్ముడు నితిన్ ఇప్పడు సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేస్తున్నాడని ఫిలింనగర్ టాక్. అయితే జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ ఇండస్ట్రీకి ఎవరి దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనేది ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఉండి నార్నే నితిన్ డాన్సుల్లో ఫైట్స్‌లో ట్రెయినింగ్ తీసుకున్నట్టు సమాచారం.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *