ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్: నాగ్ అశ్విన్

ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కొత్త చిత్రం ‘ఆదిపురుష్’ పాస్టర్ ను మంగళవారం విడుదల విషయం తెలిసిందే. ‘తానాజీ’ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘చెడుపై మంచి సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుందాం’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో ‘ఆదిపురుష్’ పాస్టర్ ను విడుదలచేశారు ఈ సినిమా ను 3డి యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ చూసి ఇది రామాయణం ఆధారంగా తెరకెక్కుతోందని అందరు అంచనా వేశారు. చిత్ర యూనిట్ ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తారేమో అని కూడా అనుకున్నారు అంతా…

‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నట్టు ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఖరారు చేశారు. ఈ విషయం నాగ్ అశ్విన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘ప్రభాస్ గారిని శ్రీరాముడిగా చూడటానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. వెండితెరపై గతంలో కొద్ది మంది మాత్రమే రాముడి పాత్ర పోషించారు. అని ‘ఆదిపురుష్’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు’’ చెప్పారు.

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *