‘ఆది పురుష్’గా ప్రభాస్ 22 సినిమా
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి, సాహూ మూవీ లతో పాన్ ఇండియా స్టార్ గా తన స్థాయిని పెంచుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ రాథే శ్యామ్ గా త్వరలో అభిమానుల ముందుకు రాబోతున్నడు. ప్రభాస్ ఆ వెంటనే ప్రభాస్ 21వ చిత్రం మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించబోతున్న విషయం సంగతి తెలిసిందే. ప్రభాస్ 21వ చిత్రంను వైజయంతీ మూవీస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ప్రభాస్ ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటుగా తన 22వ సినిమా “ఆది పురుష్” కు సంబంధించిన పోస్టర్ ను మూవీ యూనిట్ టైటిల్ లుక్ పోస్టర్ ను అధికారికంగా విడుదలచేశారు. ఈ సినిమా ను ప్రముఖ దర్శకుడు ఓం రౌత్(తానాజీ ఫేమ్) దర్శకత్వంలో తెరకెక్కనుంది. ప్రభాస్ 22 అయిన “ఆది పురుష్” ను సోషియో ఫాంటసీ ఎంటెర్టైనెర్ గా మన ముందుకు తీసుకరాబోతున్నారు . ఈ విషయం తెలిసిన ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియా లో సందడి చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియా లో “ఆది పురుష్” పోస్టర్ ట్రేండింగ్ గా నిలుస్తుంది.





