ఆ హీరోతో రొమాంటిక్ గా నటించడం చాలా ఇబ్బంది
బాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్లలో బిపాసా బసు ఒకరు. ఇండస్ట్రీలో ఎక్కువగా బోల్డ్ సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది బిపాసా బసు. ఈ భామ హిందీ సినిమాలలోనే కాక తెలుగు, తమిళ, బెంగాలీ, ఇంగ్లీష్ సినిమాలలో బోల్డ్ అండ్ రొమాంటిక్ నటించింది. తెలుగులో మహేష్ బాబు సరసన టక్కరిదొంగ అనే సినిమాలో బిపాసా నటించింది. ఈ సినిమానే తనకు ఫస్ట్ అండ్ లాస్ట్ తెలుగు మూవీ. మళ్లీ తెలుగులో ఎక్కడ కూడా కనిపించలేదు. అయితే ఈ భామ బాలీవుడ్ లో అజ్నాబి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది .. జిస్మ్ అనే ఎరోటిక్ థ్రిల్లర్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నది.
తన కెరీర్లో ఎందరో హీరోలతో ఇంటిమేట్ సన్నివేశాలలో నటించిన బిపాసా ఒక హీరోతో ముద్దు సన్నివేశంలో మాత్రం చాలా ఇబ్బంది పడిందట. అతనెవరో కాదు స్టార్ యాక్టర్ మాధవన్ అని బిపాసా బసు అన్నది. మాధవన్ సరసన బిపాసా బసు జోడిబ్రేకర్స్ అనే మూవీ లో నటించింది. ఆ సినిమాలో మాధవన్ సరసన రొమాంటిక్ సీన్లలో నటించేందుకు ఎలా ఇబ్బంది పడిందో చెప్పుకొచ్చింది. మాధవన్ నేను మంచి ఫ్రెండ్స్ . జోడీ బ్రేకర్స్లో మూవీ లో మాధవన్ని లిప్ కిస్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. దేనికంటే నేను మాధవన్ మంచి ఫ్రెండ్స్. మొత్తానికి ఆ సీన్ పూర్తి చేసినప్పుడు మాధవన్ తో పాటు అందరూ చాల బాగా నవ్వుకున్నారు. ఒక నటిగా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం నాకు ఇబ్బందిగానే ఉంటుంది.





