షారుఖ్ ఖాన్ కరోనా వైరస్ జాగ్రత్త చర్యలు
మహారాష్ట్ర రాజధాని అయిన ముంబైలో కరోనా మహమ్మారి ఉద్ధృతి అత్యధికంగా ఉన్నవిషయం అందరికి తెలుసు. ముంబైలో కరోనా పాజిటివ్ కేసులు 3 లక్షలు దాటాయి అంటే ముంబైలో కరోనా వ్యాప్తి ఎలా ఉందొ అర్ధం చేసుకోవాలి. ముంబైలో బాలీవుడ్ ఇండస్ట్రీ వారు ఎక్కువగా ఉంటారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్ తన ఇంటికి ప్లాస్టిక్ షీట్లుతో కప్పించి ఉన్న ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటులో షూటింగ్లు కొన్ని జరిగినవి ఆ సమయంలో సినిమా రంగంలో చాలా మందికి కరోనా సోకింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపి చెందుతున్నది చెప్పడంతో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ముంబైలో తాను ఉంటున్న భవంతి కి ‘మన్నత్’ ప్లాస్టిక్ షీట్లతో ముందు జాగ్రత్త చర్యలుగా కప్పించారని. సోషల్ మీడియాలో ఈ ఫొటోలను చూసిన అభిమానులు కరోనా నుండి రక్షణ కోసం ప్లాస్టిక్ షీట్లు కప్పించి ఉంటారని అనుకుంటున్నారు.
https://youtu.be/EcN5A1O9uM0





