మెగా ఫ్యామిలీ నుండి మరొ హీరో
మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి తర్వాత ఇప్పటి వరకు ఎంత మంది టాలీవుడ్ లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు అంటే మెగా ఫ్యాన్స్ కూడా వెంటనే తడుముకోకుండా వారి పేర్లు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత మంది హీరోలు మెగా ఫ్యామిలీ నుండి వచ్చేశారు. ఇంకా వచ్చేందుకు రెడీ ఉన్నారు. త్వరలో వైష్ణవ్ తేజ్ హీరోగా ‘ఉప్పెన’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత కూడా హీరోలు వస్తారని మెగా కుటుంబ సభ్యులు అంటున్నారు.
ఇండస్ట్రీలో నిహారిక హీరోయిన్‌గా రాణించాలని చాలా ప్రయత్నాలు చేసింది.కాని ఆమె కొన్ని కారణాల వల్ల ఇండస్ట్రీలో స్టార్‌డం పొందలేక పోయింది. తాను పొందలేక పోయిన స్టార్‌డంను తన భర్తకు కట్టబెట్టే అవకాశాలు నిహారికకు ఉన్నాయని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. పెదనాన్నమెగాస్టార్ చిరంజీవి యెక్క అండదండలు ఉంటే చైతన్య స్టార్ హీరోగా మారగలడు అని నిహారిక ఆలోచన. మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన విషయం మనకు తెల్సిందే. అలాగే నాగబాబుకు అల్లుడు కాబోతున్న చైతన్య కూడా ఖచ్చితంగా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రావడం కన్ఫర్మ్ అంటున్నారు.
https://youtu.be/1emqyvphBWQ





