గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ప్రజల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు పాకిన ఈ కరోనా ఇంపాక్ట్ రీసెంట్ గా, రాష్ట్రంలో ముగ్గురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకి పాజిటివ్ వచ్చింది. వీరిలో జనగమ ఎమ్మెల్యే ముత్తిరేడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు – బజీరెడ్డి గోవర్ధన్, బీగల గణేష్ గుప్తాలు ఉన్నారు. రీసెంట్ గా ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్డీకి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రజాప్రతిధుల లిస్ట్ ని మరింత పెంచుతూ, బీజేపీ గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కి కూడా కరోనా అని తేలింది. గత వారం రాజా సింగ్, గన్‌మేన్ బలరాం యాదవ్‌కు కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా కరోనా టెస్టు చేయించుకున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం రాజా సింగ్ కు కూడా కరోనా సోకింది అని తేలింది. ప్రస్తుతం రాజాసింగ్ ని మీట్ అయినా వారి డీటెయిల్స్ వెతికే పనిలో ఉన్నారు.





