Harish Shankar Comments On Jr Ntr family
ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి తెరకెక్కించే చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తో బిజీ అయిపోయాడు…. ఆర్ఆర్ఆర్ మూవీ 2020లో రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే…
ఎన్టీఆర్ హోలీ సందర్భంగా ఫ్యాన్స్ కు విషెష్ ను తెలియజేస్తూ భార్య లక్ష్మి ప్రణతి.. కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఎన్టీఆర్ కొడుకులు ఇద్దరూ క్యూట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంటున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్ లో ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ లుక్ పై కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ లో ‘ఆ చిన్నోడు కెమెరా వంక చూస్తున్న విధానం చూస్తుంటే రెండేళ్లు కూడా నిండని ఆ బుడతడు కెమెరాని పేస్ చేయడం బాగా లావాటైనట్లుగా విషయాన్ని తెలుస్తుంది అని చాలా చక్కగా ఫోజు ఇచ్చాడు వదిలితే దూకేసేలా ఉన్నాడు’ అని హరీష్ కామెంట్స్ చేశాడు.





