“Bheeshma” Movie Review | Nithiin | Rashmika Mandanna 

 

“Bheeshma” Movie Review | “భీష్మ” మూవీ రివ్యూ | Nithiin | Rashmika Mandanna

యువ హీరో “నితిన్ ” క్రేజీ హీరోయిన్ “రస్మిక” చలో జంటగా నటించిన చిత్రం “భీష్మ” ఈ చిత్రానికి “చలో ” ఫేమ్ “వెంకీ” కుడుముల దర్శకత్వం వహించారు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు మెలోడీ భ్రమ్మ మణి శర్మ కొడుకు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ ఐనా “భీష్మ” ఈ సినిమా కథ విషయానికి వస్తే నితిన్ క్యారెక్టర్ పేరు “భీష్మ” అందమైన మంచి అమ్మాయి ని చూసి ప్రేమిoచాలని అని అనుకుంటాడు కానీ ఏ అమ్మాయి ఆతను అనుకున్నుట్టుగా కనిపించదు. “భీష్మ” ఆ పేరు వల్లనో ఏమో ఒకరు కూడా పడలేదు అని ఫీల్ అవుతూవుంటాడు. ఇలాంటి టైం లో కథను ముందుకు నడిపించటానికి కథానాయక “రస్మిక”
కనిపిస్తుంది ఆమెను ప్రేమలో పడవేయటానికి చాల రకాలుగా ప్రయత్నిస్తూవుంటాడు కానీ అస్సలు విషయం తెలుకున్న కథానాయక
“భీష్మ” ప్రేమను తిరస్కరిస్తుంది ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఓ వైపు ఇలా జరుగుతువుంటే మరోవైపు సేంద్రియ వవ్యసాయం గురించి ఓ స్టోరీ జరుగుతూ ఉంటుంది. “భీష్మ” ప్రేమకు వచ్చిన సమస్య ఏంటి సేంద్రియ వవ్యసాయానికి “భీష్మ” కు వున్నా సంబంధం ఏంటి మిగిలిన కథ.

https://youtu.be/YKfEmPfo6IE

నితిన్ పెర్ఫార్మెన్స్ వస్తే “భీష్మ” క్యారెక్టర్ కి తగ్గట్టుగా చాలా చక్కగా నటించాడు నితిన్ యాక్టింగ్ , డాన్స్ , డైలాగ్, స్టైల్ ఇలా ఒకటి ఏమిటి అన్నిటిలో సూపర్ అనేలా నటించాడు. ముఖ్యంగా చెప్పుకోవాలిసింది నితిన్ డాన్స్ గురించి “వాట్ ఏ బ్యూటీ” సాంగ్ లో తన టాలెంట్ ని చూపించాడు. పంచ్ డైలాగ్స్ తో కామెడీ చేస్తూ యాక్షన్ ఇరగ తీసాడు. “రస్మిక” ఐతే ఈ సినిమాలో మరింత అందంగా కనిపించింది. పాత్రకు తగ్గుట్టుగ్గా నటించి మెపించిన ఈ అమ్మడు డాన్స్ లో నితిన్ కి పోటీ పడి మరి డాన్స్ లు చేసింది. “నితిన్ ” “రస్మిక” ఫై చిత్రీకరించిన రొమాంటిక్ సీన్స్ యూత్ ని బాగా ఆకుట్టుకునేలా వున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ అబ్దుత మైన సంగీతాన్ని అందించారు. పాటలకె కాకుండా రి రికార్డింగ్ కూడా కరెక్ట్ గా సెట్ అయినది. కన్నడ నటుడు అనంత్ నాగ్, సంపత్, నరేష్ తదితరులు పాత్రకు తగ్గట్టుగా నటించారు సాయి శ్రీరామ్ సినిమా ఆటోగ్రఫీ సూపర్ అనేలా వున్నది. ప్రతి సినీ చాల రీచ్ గా కనిపించింది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఏ మాత్రం రాజి పడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను నిర్మించారు. రఘు బాబు వెన్నెల రవి కిశోర్ ల కామెడీ బాగుంది టోటల్ గా “భీష్మ” గురుంచి ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యామిలీతో థియేటర్ వెళ్ళి హాయ్ గా ఎంజాయ్ చేసేలా వున్నా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ “భీష్మ”

ప్లస్ పాయింట్స్ : నితిన్ పెర్ఫార్మెన్స్ , కామెడీ సీన్స్ , డైరెక్షన్ , అండ్ ఎంటర్టైన్మెంట్ .
మైనస్ పాయింట్స్ : థిన్ (బలహీనమైన) స్టోరీ , ఊహాజనిత క్లైమాక్స్

                            

Share this article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *