Bigboss 3 Utsavam Highlights | Rahul | Srimukhi | TVNXT Telugu
తెలుగు బిగ్ బాస్ అంటేనే మనకు గుర్తొచ్చేది కాంట్రవర్సీలు… బిగ్ స్టార్స్ హోస్టింగ్…సినిమాల్లో అడపాదడపా అవకాశాలు అందిపుచ్చుకుని ఫేడ్ అవుట్ అవుతున్న ఆర్టిస్టులు మళ్లీ ఓ వెలుగు వెలిగడానికి చేసే ప్రయత్నం అని చెప్పవచ్చు…బిగ్ బాస్ వన్ సీజన్ వన్ హోస్టింగ్ మన జూనియర్ ఎన్టీఆర్ చేశారు..కూల్ అండ్ కామ్ గా మంచి టైమింగ్ రైమింగ్ తో ఫన్నీ యాంగిల్ లో హోస్టింగ్ చేశారు.సెకండ్ సీజన్ ఈ నేచురల్ స్టార్ నాని తనదైన స్టైల్ లో చేసి మెప్పించారు..అక్కడ కౌశల్ ఆర్మీ అంటూ సీజన్స్2 లో ఒక కాంట్రవర్సీ లాంటి గ్రూపు ఏర్పడి బీభత్సం చేసిందని చెప్పవచ్చు …ఇక సీజన్ 3 వచ్చేసరికి కింగ్ నాగార్జున తన మేనరిజంతో మెస్మరైజ్ చేశాడు.ఈ సీజన్లో శ్రీముఖి రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి భూపాలం అలీ రెజా శివ జ్యోతి వరుణ్ సందేశ్ వితిక శేరు తమన్నా రవి కృష్ణ రోహిణి హిమజా హేమ ఇలా 16 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు.శ్రీముఖి రాహుల్ కి మధ్య గొడవ ,పునర్నవి రాహుల్ మధ్య ప్రేమాయణం లాంటి ట్రాక్ తో బిగ్బాస్ సీజన్ 3 సక్సెస్ ఫుల్ గా రన్. అయిందని చెప్పవచ్చు .. వరుణ్ సందేశ్ వితిక షేరు మధ్య వివాహ బంధం లో ఉండే మెచ్యూరిటీ లెవల్స్ ఇంకా పెరిగే అని చెప్పాలి….ఇలా ఒక్కొక్కరికి వాళ్ళ జీవితానికి సరిపడా ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేశారు.
రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ త్రీ విన్నర్ అయ్యాక తన ఫ్యాన్స్ కోసం మ్యూజిక్ కంసెట్ చేయడం ,వరుసగా ఇంటర్వ్యూ ఇవ్వడం టీవీ షో లో పాల్గొనడం సినిమా అవకాశాలు పొందడం జరిగిపోయాయి.
ఇప్పుడు 16 మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కలిసి utsav పేరుతో ఒక గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు..అందులో ఒకరిపై ఒకరు పంచులు, రొమాంటిక్ యాంగిల్స్ సెటైర్లు ఇలా షో మొత్తం ఫుల్ ఫన్ తో ఉండబోతుందని ప్రోమో చూస్తే తెలిసిపోతుంది .ఈ షో ద్వారా నే శ్రీముఖి రాహుల్ మధ్య ఉన్న వైరం కాస్త ఫ్రెండ్షిప్ గా మారినట్లు మొన్న ఒక పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఉత్సవంలో రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి భూపాలం మధ్య మరింత కెమిస్ట్రీ పెంచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పండితే షో హిట్ అవ్వడం గ్యారెంటీ….వీళ్లిద్దరు కలిసి ఒక సినిమాలో హీరో హీరోయిన్లుగా చేయబోతున్నారని రూమర్స్ కూడా ఫిలింనగర్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.





