సత్యదేవ్ కొత్త సినిమా త్రివిక్రమ్ టైటిల్…
టాలీవుడ్‌లో ఓటీటీ విడుదలైన 47డేస్‌తో పాటు ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో విజయాన్ని అందుకున్న హీరో సత్యదేవ్. తన తదుపరి చిత్రాన్నిమొదలుపెట్టాడు. ఈసారి సత్యదేవ్ కన్నడంలో హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ మూవీ తెలుగు రీమేక్ లో నటించనున్నాడుఈ చిత్రానికి ‘గుర్తుందా శీతాకాలం’అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సత్యదేవ్ తమన్నా నాయకానాయికలుగా నాగశేఖర్ మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న చిత్రంకి నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఆ టైటిల్ ను అప్పట్లో నితిన్ తో త్రివిక్రమ్ ఓ సినిమా ప్రొడ్యూస్ చేసారు. ఆ సినిమాకు ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్ అనుకున్నారు. అయితే లాస్ట్ మినిట్ లో ఆ టైటిల్ వద్దనుకుని ప్రక్కన పెట్టేసి..ఛల్ మోహన్ రంగా అనే టైటిల్ తో ఆ సినిమాను విడుదల చేసారు. ఆ టైటిల్ అలా ఉండిపోయింది. మళ్లీ ఇప్పుడు ఆ టైటిల్ ని సత్యదేవ్ చిత్రానికి ఉపయోగిస్తున్నారు.





